Thursday, April 24, 2025
spot_imgspot_img

Top 5 This Week

spot_img

Related Posts

అనితర సాధ్యుడు.. దార్శనికుడు

బాబుకి బర్త్ డే విషెస్ లో పవన్ పొగడ్తలు

సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అనితర సాధ్యుడు,
రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేసిన దార్శనికుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు.

ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని కోరారు.
అలాగే కుప్పంలో ఓటమి ఎరుగని చంద్రబాబుపై ప్రజలు ఎనలేని ప్రేమాభిమానాలు చూపించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలోని పూరి ఆర్ట్స్ కళాకారుడు పురుషోత్తం వైట్ షీట్ పై చంద్రబాబు నమూనా చిత్రాన్ని రూపొందించారు. సైడ్ లైన్స్, బోర్డర్ తో ఆయన రూపం వచ్చేలా ఆర్ట్ వేశారు. ఇంక్ ప్యాడ్ ల సహాయంతో కుప్పం మహిళలు, చిన్నారులు, పురుషుల వేలి ముద్రలతో సీఎం చిత్రపటం వచ్చేలా రూపొందించారు. దాదాపు 2000 వేల మందికి పైగా వేలిముద్రలు వేసి చంద్రబాబు పోర్ట్రెయిట్ వచ్చేలా చేశారు. అనంతరం ఈ పోర్ట్రెయిట్‌ను కుప్పం నలుమూలల తిప్పి సంబరాలు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles