ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కే.ఎస్. శ్రీనివాస్ రాజును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ రాజు గతంలో తిరుమల తిరుపతి ఏపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారికి రేవంత్ సర్కార్ కీలక పోస్ట్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కే.ఎస్ శ్రీనివాస్ రాజును నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీనివాస్ రాజు తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదీర్ఘకాలం పని చేశారు. ఆయన టీటీడీ జేఈవో కీలక బాధ్యత నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటేషన్‌పై రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ పని చేశారు. తాజాగా.. సీఎం రేవంత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.దేవస్థానం (టీటీడీ) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.