ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నియామకాలు చేపట్టారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన విశాఖ జిల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కే కే రాజుకు జగన్ అప్పగించారు. కే కే రాజు ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లా సమస్యలపై అవగాహనతో పాటుగా పార్టీలోని అన్ని వర్గాల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి.