ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం వెలుగు చూసింది.. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు.. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు.. ఇదే అదునుగా భావించి.. విద్యార్థినిపై జయరాజు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది.. అయితే, ప్రస్తుతం పదోవ తరగతి చదువుతుంది ఆ విద్యార్థిని.. 3 నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు నిర్వహించి.. గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్ లో బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు.. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.