వేసవిలో మన శరీరానికి కావలసిన చల్లదనాన్ని ఇస్తుంది ..పుచ్చకాయ
వేసవిలో ప్రతి ఒక్కరూ బాగా ఇష్టపడేది పుచ్చకాయలు. సీజనల్ ఫ్రూట్ అయిన పుచ్చకాయలలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే పుచ్చకాయలో నీరు కూడా అధికంగా ఉంటుంది. వేసవిలో మన శరీరానికి కావలసిన చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు నీరు అధికంగా ఉండడంతో రక్తపోటును తగ్గించడానికి దోహదపడుతుంది .అలాగే చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పుచ్చకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, వేసవికాలంలో ఎక్కువ మందికి మలబద్దక సమస్య ఏర్పడుతుంది.ఈ సమస్యతో బాధపడేవారికి పుచ్చకాయ తినడం వలన మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.ఎండలో బయటకు వెళ్లే వారు తొందరగా డీ హైడ్రేషన్ కు గురి అవుతూ వుంటారు. అలాంటివారికి వడ దెబ్బ తగలకుండా ఉండేందుకు పుచ్చకాయ సహాయం చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది వేసవిలో ఎక్కువగా గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతుంటారు. అలా పడకుండా వుండటానికి పుచ్చకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది పుచ్చకాయలో మెగ్నీషియం తోపాటు భాస్వరం ఉంటుంది. ఇది గుండె పని తీరుని మెరుగుపరుస్తుంది. గుండెకు సంబంధించిన నాళాలు పనిచేయడానికి దోహదపడే పోషకాలు పుచ్చకాయ తినడం వలన శరీరానికి అందుతాయి. పుచ్చకాయలు అలసట నుండి రిలీఫ్ ఇస్తాయి. పుచ్చకాయ తినడం వలన ఈ లాభాలు కూడా కరోనా సంక్షోభం నుండి ప్రతిఒక్కరు రోగ నిరోధకశక్తిని బలోపేతం చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నపుడు మన శరీరం జబ్బుల బారిన పడుతుంది. మన బాడీకి కావలసిన రోగ నిరోధక శక్తి పుచ్చకాయలో ఎక్కువగా లభిస్తుంది. పుచ్చకాయ తినడం వలన చర్మ సౌందర్యం ఉపయోగపడుతుంది. వేసవిలో వీచే గాలులకు చర్మం పొడిబారుతుంది. చర్మ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం రాకుండా పుచ్చకాయ నియంత్రిస్తుంది. పుచ్చకాయలతో మూత్రపిండాల ఆరోగ్యం అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయలో నీరు శాతం ఎక్కువగా ఉండటం వలన ఇది తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువ తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గటానికి ఇది దోహదం చేస్తుంది. పుచ్చకాయ మూత్ర పిండాల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. పుచ్చకాయలు డయాబెటిస్ బాధితులకు మంచిది. అయితే మితంగానే తినాలి.