


అవిశ్వాస తీర్మానంతో వైసీపీ మేయర్ వెంకటకుమారి పదవిని కోల్పాయారు ఆమె స్థానం లో మేయర్ గా 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాస్,డిప్యూటీ మేయర్ గా 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత (యాదవ) మరియు రెండవ డిప్యూటీ మేయర్ గా 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను(కాపు)లకు పదవులు దాదాపు ఖరారయినట్లు తెలుస్తుంది.ఒక డిప్యూటీ మేయర్ జనసేనకు తొలుత కేటాయించగా,జనసేన పార్టీ డీసీసీబీ చైర్మన్ పదవి ఆశయించిన కారణంగా మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ పదవులు టీటీడీ కే దక్కాయి.వైసీపీ హయాంలో మేయర్ యాదవ సామజిక వర్గానికి చెందిన వెంకటకుమారికి అవకాశం ఇచ్చింది. .టీడీపీ ఆమె ఫై అవిశ్వాస తీర్మానం పెట్టగానే యాదవ కులానికిచెందిన మేయర్ ఫై అవిశ్వాస తీర్మానం పెట్టడం సిగ్గుచేటని వైసీపీ విమర్శించింది. మరోసారి అలాంటి విమర్శలకు తావులేకుండా టీడీపీ యాదవ కులానికి చెందిన మొల్లి హేమలత డిప్యూటీ మేయర్ గా ఎంపికచేసింది.