విశాఖలో ఉర్సాకు భూముల కేటాయింపు పైన జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఉర్సా లాంటి కంపెనీలకు మాత్రం మూడు వేల కోట్ల విలువైన భూములు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విశాఖలో లులూ వంటి వాటికి ఎలాంటి టెండర్లు లేకుండా రూ 1500 కోట్ల విలువైన భూములు ఇస్తున్నారని జగన్ పేర్కొన్నారు.