ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు తీసుకుంది.. ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో సిట్ అధికారుల దాడులు చేశారు.. ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకరించడంతో.. శంషాబాద్ మండలంలోని కాచారం ఫార్మ్ హౌస్‌లో దాడులు చేసిన సిట్.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది.. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్టు పేర్కొన్నారు అధికారులు.. మరోవైపు, మద్యం కేసులో కీలక నిందితుడు వరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు..మొత్తంగా ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో అరెస్ట్ జరిగింది.. మద్యం కేసులో కీలక నిందితుడు వరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు.. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుంది.. మద్యం కుంభకోణంలో A1 గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కీలక వ్యక్తి వరుణ్ ఉన్నట్టు చెబుతున్నారు.. ఈ కేసులో ఏ40గా ఉన్నాడు వరుణ్.. ఇక, శంషాబాద్ ఫాం హౌస్ లో 11 కోట్ల నగదు ఉన్న విషయం చెప్పాడట వరుణ్.. దీంతో.. ఫాం హౌస్ లో సోదాలు నిర్వహించి.. ఆ ఫామ్‌హౌస్‌లో సీజ్ చేసిన డబ్బును విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు అధికారులు..