Tuesday, May 20, 2025
spot_imgspot_img

Top 5 This Week

spot_img

Related Posts

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫొటోను రైల్వే టికెట్లపై ముద్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో ఉన్న అన్ని రైల్వే జోన్లకూ ఓ సర్కులర్ ను జారీ చేసినట్లు తెలుస్తోంది. టికెట్లపై ముద్రించాల్సిన ప్రధాని మోదీ ఫొటోను కూడా ఈ సర్కులర్ కు అటాచ్ చేసినట్లు సమాచారం.

భారత్- పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ప్రధాని మోదీ పంజాబ్ లోని ఆదమ్‌పూర్ ఎయిర్‌ బేస్ స్టేషన్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడి వైమానిక దళం సిబ్బందితో మాట్లాడారు. వారితో ముచ్చట్లు పెట్టారు. సెల్ఫీ దిగారు. వారి భుజాలపై చేతులు వేసి, ఆప్యాయంగా పలకరించారు. వారు ఎదుర్కొన్న అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. పాకిస్తాన్ డ్రోన్లు, అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్, క్షిపణులు.. ఇవన్నీ కూడా భారత వైమానిక బలం ముందు విఫలం అయ్యాయని అన్నారు. ఈ ఘనత- దేశంలోని అన్ని వైమానిక బేస్ స్టేషన్లకు దక్కుతుందని చెప్పారు. ప్రతి వాయుసేన యోధుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ప్రశాంతంగా జీవించడానికి చోటు లేదనే హెచ్చరికను పంపించామని ప్రధాని మోదీ అన్నారు. హమ్ ఘర్ మే ఘుస్ కే మారేంగే.. అని నినదించారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల సామర్థ్యానికి అద్దం పట్టిందని మోదీ పేర్కొన్నారు. పాక్‌పై దాడులు సమయంలో దేశ సాయుధ దళాల సమన్వయం అద్భుతమని కీర్తించారు.

ఆ సమయంలో మోదీ- ఓ ఫొటో దిగారు. వైమానిక దళ యోధులను సెల్యూట్ చేస్తూ ఓ ఫొటో క్లిక్ మనిపించారు. బంగారు రంగులో- ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సత్తాను చాటేలా త్రిశూలం, వాయుసేన లోగోను ముద్రించిన డార్క్ బ్లూ క్యాప్ ను ధరించి.. ఆపరేషన్ సింధూర్ వీరులకు సెల్యూట్ చేసిన ఫొటో అది. మోదీ వెనుక ఎస్- 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అందులో పడింది.

ఇప్పుడదే ఫొటోను రైలు టికెట్లన్నింటిపైనా ముద్రించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారత ఆర్మీ పరాక్రమానికి గుర్తింపుగాఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ఫొటోను చూడగానే ఆర్మీ సాధించిన విజయాలు గుర్తుకు రావాలనేదే తమ ఉద్దేశమని పేర్కొంది.

ప్రధాని ఫోటోను ఉపయోగించడంతో పాటు రైల్వే స్టేషన్లలో వివిధ కార్యకలాపాలు, కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలను జరుపుకోవడంలో దేశంలోని అన్ని రైల్వే డివిజన్లు, జోన్లు ముందంజలో ఉన్నాయని రైల్వే బోర్డు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే డివిజన్లలోని పాఠశాలల్లో ఆపరేషన్ సింధూర్ పైపెయింటింగ్ పోటీలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో సైనికుల ధైర్య సాహసాలను హైలైట్ చేసే వీడియో క్లిప్పింగ్‌లను అనేక స్టేషన్లలో పబ్లిక్ డిస్ ప్లే సిస్టమ్‌ల ద్వారా ప్రసారం చేశామని పేర్కొన్నారు.

జమ్మూ, పఠాన్‌కోట్, న్యూఢిల్లీ, శ్రీనగర్ తో పాటు ఇతర రైల్వే స్టేషన్లు సాయుధ దళాల సాహసాన్ని పెయింట్ చేశామని,ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా ఆయా స్టేషన్లను సింధూరం రంగులో అలంకరించామని తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆవరణల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టినట్లు చెప్పారు.

జమ్మూ, పఠాన్‌కోట్, న్యూఢిల్లీ, శ్రీనగర్ తో పాటు ఇతర రైల్వే స్టేషన్లు సాయుధ దళాల సాహసాన్ని పెయింట్ చేశామని,ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా ఆయా స్టేషన్లను సింధూరం రంగులో అలంకరించామని తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆవరణల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles