ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ, భారత్-అమెరికా బంధం కొత్త శిఖరాలకు చేరుకుంటోంది.నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా, అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో, ఈ భేటీకి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు నేతల మధ్య రహస్యంగా జరిగిన ఈ చర్చల అనంతరం, ప్రతినిధి బృందాల మధ్య విస్తృత స్థాయి సంప్రదింపులు జరిగాయి.
చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్: ల్యాప్టాప్లు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న అమెరికా కంపెనీలకు, భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది.
మోదీ-వాన్స్ భేటీ
