భార్య అందంగా ఉండాలని ఏ భర్తకి అయిన అనిపిస్తుంది. భార్య అందంగా ఉండే ఆనంద పడడం సహజమే కానీ.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుని తిన్నాడో భర్త ఈ దారుణమైన ఘటన బెంగాల్‌లోని నదియా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఊహించని ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదేం పిచ్చి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…
శాంతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 2న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాపన్ షేక్ ఇంట్లో మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేయడం స్థానికులు గమనించారు. దీంతో చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించగా.. ఇంట్లో నుంచి గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చినంది. ఆమె ముక్కు నుంచి తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఏం జరిగిందని విచారించగా.. భర్త తన ముక్కును కొరుక్కుతిన్నాడని ఆమె చెప్పడంతో వారంతా ఖంగుతిన్నారు. అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానని భర్త అనేవాడని.. చివరకు అన్నంత పని చేశాడని కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి మధు ఖాతూన్ శాంతీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ఆమె భర్తను అరెస్ట్ చేసినట్టు సమాచారం.
భార్య ముక్కు బాగుందని కొరికి తిన్న భర్త….
