కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.. కృష్ణా బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు నిండిపోవడంతో.. ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది కృష్ణమ్మ.. అయితే, అంతకంతకు నీటి ప్రవాహం పెరుగుతుండడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు.. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతోన్న నేపథ్యంలో.. మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు అధికారులు.. అందులో 15 గేట్లను 2 అడుగుల మేర, మిగతా 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు.. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులకు చేరగా.. అప్రమత్తమైన అధికారులు.. బ్యారేజీ కెపాసిటీ 3.07 టీఎంసీలు దాటకుండా జాగ్రత్త పడుతున్నారు.. సముద్రంలోకి 60,875 క్యూసెక్కుల నీరు వెళ్తుండగా.. కృష్ణా తూర్పు కాలువకు 10,207 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ కాలువకు 5527 క్యూసెక్కుల నీరు.. గుంటూరు ఛానెల్ కు 200 క్యూసెక్కుల నీరు.. ఇలా మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 72,909 క్యూసెక్కులుగా ఉంది.. అంటే.. ఇన్‌ఫ్లో రూపంలో వస్తున్న నీటిని మొత్తం.. అదే తరహాలో బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు..