రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతి, లాటిన్ అమెరికాకు చెందిన తొలి పోప్.. పోప్ ఫ్రాన్సిస్(88) మృతి చెందారు. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇది వారికి తీరని లోటుగా చెప్పొచ్చు. ఇక ఆయన మృతిపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
అయితే పోప్ ఫ్రాన్సిస్ మృతికి నివాళిగా ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన మృతికి నివాళిగా ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ చీకట్లోకి వెళ్లనుంది. ఈఫిల్ టవర్ లో విద్యుత్ దీపాలను ఆపేయనుంది అక్కడి యంత్రాంగం. ఫ్రాన్స్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సోమవారం రాత్రి ఈఫిల్ టవర్ లో విద్యుత్ ను తొలగించనున్నారు అధికారులు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ మృతికి నివాళిగా ప్యారిస్ లోని నోట్రే డ్యామ్ కేథడ్రెల్ లోని బెల్ ను 88 సార్లు మోగించారు. పోప్ ఫ్రాన్స్ వయసు 88 సంవత్సరాలు కాబట్టి బెల్ ను 88 సార్లు మోగించి ఆయన అరుదైన నివాళిని అర్పించింది అక్కడి యంత్రాంగం. అంతేకాక పోప్ ఫ్రాన్సిస్ కు గుర్తుగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఓ నగరానికి ఫ్రాన్సిస్ అనే పేరును పెట్టాలని తీర్మానించింది. ఈ నిర్ణయంపై ఫ్రాన్స్ లోని క్రిస్టియన్లు సుముఖత వ్యక్తం చేశారు. Also Read “Pope Francis:వాటికన్‌కు కొత్త రూపు-పోప్ ఫ్రాన్సిస్ తెచ్చిన సాహసోపేతమైన సంస్కరణలివే..!!” Powered By పోప్ ఫ్రాన్సిస్ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ ట్వీట్
పోప్ ఫ్రాన్సిస్ మరణం చాలా బాధాకరం. చిన్న వయసు నుంచే ఆయన క్రీస్తు ఆశయాల కోసం పనిచేశారు. మిలియన్ల మంది కరుణ, మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా గుర్తుండిపోతారని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇక పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందడంతో.. తదుపరి పోప్ ఎవరు అన్న అంశంపై చర్చ ప్రారంభం అయింది. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.