వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈనెల 31వ తేదీన (గురువారం) నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ ఇప్పటికే పోలీసులు నోటీసులు అందించారు. తాజాగా జగన్ జిల్లా పర్యటనపై నెల్లూరు ఇన్‌ఛార్జి ఎస్పీ దామోదర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. జన సమీకరణ చెయ్యడం లేదని వైసీపీ నేతలు చెప్పారన్నారు. హెలిపాడ్ వద్ద 10 మందికే అనుమతి ఇచ్చామన్నారు. జైలు వద్ద ముగ్గురికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.. జైలు వద్ద పబ్లిక్ కి అనుమతి లేదని.. నిబంధనలు బ్రేక్ చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. జగన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నామన్నారు.. రోడ్ షోలకు అనుమతి లేదని.. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంటి వద్దకు 100 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. బైక్ ర్యాలీకి అనుమతి లేదని.. ఫ్లకార్డ్స్, బ్యానర్స్ ప్రదర్శిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. 30 యాక్ట్ అమలులో ఉందని స్పష్టం చేశారు.. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఆంక్షలు విధించినట్లు తెలిపారు.. లైవ్ డ్రోన్స్ ఏర్పాటు చేస్తున్నాం.. ప్రతి యాక్టివిటీ కంట్రోల్ రూమ్ లో రికార్డు చేస్తామని స్పష్టం చేశారు. Z ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగానే బందోబస్త్ ఉంటుందన్నారు..