Thursday, May 1, 2025
spot_imgspot_img

Top 5 This Week

spot_img

Related Posts

త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర భేటీ- పూర్తి స్వేచ్ఛ

: జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 23వ తేదీన ఏర్పాటైన భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఈ నిర్ణయాలను తీసుకుంది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశించింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుందని తెలిపింది.

ఇప్పుడు రెండోసారి సీసీఎస్ భేటీ కానుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు కానుంది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. సీసీఎస్ సభ్యులు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, భద్రత వ్యవహారాల సలహదారు అజిత్ ధోవల్, కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇందులో పాల్గొననున్నారు. దీనికి ముందు- ప్రధాని మోదీ మరో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఇందులో పాల్గొన్నారు.

దీనికి ముందు- ప్రధాని మోదీ మరో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఇందులో పాల్గొన్నారు.

వారితో పాటు త్రివిధ దళాధిపతులు ఈ భేటీకి హాజరు కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పహాల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగబోతోందంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో సహా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం చర్చనీయాంశమౌతోంది.
త్రివిధ దళాధిపతులు ఉపేంద్ర ద్వివేది (ఆర్మీ), అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి (నేవీ), అమర్ ప్రీత్ సింగ్ (వైమానిక దళం)తో ప్రధాని మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు. యుద్ధానికి దిగాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశం ఆరా తీసినట్లు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ వద్ద సరిహద్దు చొరబాట్లను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు సాగినట్లు తెలుస్తోంది. పఠాన్ కోట్, హిండన్, యలహంక, అంబాలా, మహారాజ‌్‌పూర్, తేజ్‌పూర్ వంటి ఎయిర్ బేస్‌ వివరాల గురించి ఈ సందర్భంగా మోదీ వారిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదాన్ని అణిచివేయడమే తమ సంకల్పమని మోదీ తేల్చి చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాయుధ దళాల సామర్థ్యాలపై ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నాయి. నిర్ణయాలను తీసుకోవడంలో త్రివిధ దళాధిపతులకు మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అది ఎలాంటిదైనా ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారని వివరించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles