శ్రీవారి దర్శనం కు వచ్చే భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక సూచనలు
తిరుమల ..
తిరుమలలో శ్రీవారి దర్శనం కు వచ్చే భక్తుల రద్దీ క్రమేణా పెరుగుతోంది. వేసవి సెల వుల వేళ ప్రతీ ఏటా భక్తుల రద్దీ పెరగటం సాధారణం. రద్దీకి అనుగుణంగా టీటీడీ ముందస్తు చర్య లు చేపట్టంది. ఇదే సమయంలో భక్తులకు కీలక సూచనలు చేస్తోంది. బ్రేక్ దర్శన లేఖలను ఈ రద్దీ ముగిసే వరకూ నిలుపుదల చేసే ఆలోచనలో టీటీడీ ఉంది. కాగా, దివ్య దర్శనం టోకెన్ల విషయం పైన టీటీడీ ఫోకస్ చేసింది. దీంతో, శ్రీవారి దర్శనం కు వచ్చే భక్తులు రద్దే వేళ తమ సూచనలు పాటించాలని టీటీడీ కోరుతోంది. నిర్దేశిత సమయంలోనే తిరుమలలో శ్రీవారి దర్శనం కు వచ్చే భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక సూచన చేసింది. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే రావాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. ఆయన సర్వ దర్శన క్యూలైన్లను పరిశీలించారు. టీబీసీ, ఏటీసీ వద్ద క్యూలైన్లలో భక్తులకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. క్యూలైన్లలోని భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ను ఆయన పరిశీలించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్న ప్రసాదాలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్ లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రత్యేక చర్యలు క్యూ లైన్లలో ఉన్న భక్తుల కోసం నూతనంగా ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తు లకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులకు ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో దర్శనాలు కల్పిస్తున్నామని వివరించారు. ఇదే సమయంలో శ్రీవారి దర్శనం అలిపిరి మార్గంలో కాలి నడకన తిరుమలకు వస్తున్న వారికి గతంలో ఉన్న ప్రయోజనాలను పునరిద్దరించాలని డిమాండ్ పెరుగుతోంది. వేసవి లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో..రెండ నడక మార్గాల్లో వచ్చే వారి కోసం దివ్య దర్వనం టోకెన్లు ఇవ్వటంతో పాటుగా కోటా పెంచాలని కోరుతున్నారు. కరోనా సమయంలో ఈ టోకెన్ల జారీ నిలిపివేసారు. ఆ తరువాత చిరుత దాడితో తిరిగి టోకెన్లు తిరిగి ప్రారంభించలేదు.