Thursday, April 24, 2025
spot_imgspot_img

Top 5 This Week

spot_img

Related Posts

గంట గంటకో రేటు-గదులకు ఉండదు లోటు

విశాఖనగరం చాల ప్రశాంతమయినది అందమయినది ఎవరికి ఏమికాలంటే అది ఇస్తుంది సాగరతీరం చల్లగాలికి తోడుగా పిల్లగాలి ఉంటె ఇంకాబాగుంటుంది పిల్లగాలికి కాస్త పిల్లాడు తోడుంటే ఇంకా హాయిగా ఉంటుంది.ఆలా ఆలా అడుగులో అడుగేస్తూ చేతిలో చేయిపట్టి మూసి మూసి నవ్వులు నావూకుంటూ గుస గుస లాడుకుంటే ఇంకేముంది ప్రమాదకరమయిన కెరటాలు మీద పడ్డ హాయిగానే ఉంటుంది.ఈ గుస గుసలు పెళ్లికాని ప్రేమికుల మధ్యనే కాదు పెళ్లయి అక్రమసంభందాలు వెతుక్కుని మరి తిరుగుతున్నారు. క్రమ సంభందాలు అక్రమ సంబంధాలుగా మారుతున్నాయి దానికి కారణం అక్రమసంపాదన కోసమే ఆదాయం తక్కువ ఇంటిలోలి ఒంటిమీదకి హంగులు కావాలంటే కష్టపడకుండా సంపాదించాలి దానికి ఒక్కటే మార్గం ఆత్మాభిమానాన్ని వదిలేసి మానానికి వెలకట్టేయడమే ఏముంది సిగ్గు ఎగ్గూ వదిలేసి ఒక గంట సేపు ఈ శరీరం మనది కాదు అనుకుంటేసారి చెమట చిందకుండా సొమ్ము వచ్చిపడుద్ది అది నేటి ట్రెండ్స్.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్ కి చాల పేర్లు ఉన్నాయి డేటింగ్,రూమ్మీట్.కో మీట్, రూమ్ షేర్.క్రష్ కొత్తగా హాఫ్ లవ్ అని రకరకాల పేర్లు వచ్చాయి.పేర్లు వేరయినా జరిగేది మాత్రం శ్రమ లేకుండా సుఖంగా సొమ్ము సంపాదించడమే ఈ పేర్లన్నీ వ్యభిచారానికి సుందమయిన అలంకార రూపాలు సొమ్ము సంపాదిన్చడమే ముఖ్యం ఎలా సంపాదించావు అనేది ముఖ్యం కాదు.ఉన్న వయసుని సొగసుని సొమ్ములు ఇచ్చేవాడి వయసుతో పనిలేకుండా చీకటిలో పని కానిస్తే సరి కమ్మని మైకంలో పైకం వచ్చిపడుతుంది. సుఖఃమయిన సంపాదనకు వయసుతో పనిలేదు ఎవరికైన ఎలాంటివారికైనా ఎల్లప్పుడూ అందుబాటులో దేనికైనా అందుబాటుగా ఉండే ఒకే ఒక్క నగరం అది విశాఖమహానగరం .

విలాస విడిది భోగాలకు నిలయమయిన విశాఖనగరం ఎంతో అభివృద్ధి చెందింది. ఎక్కడ చూసినా అందాల అద్దాల భవనాలు భవనాల్లో అందమయిన పడక గదులు, చూపరులను రసిక శృంగార ప్రియులను మోహింపజేసే విధంగా గదిలో అలంకరణలు మనంఉన్నది గదిలో ఉన్నామా లేక సాగర కన్య కౌగిలో ఉన్నామా అనే రీతిలో ఉంటాయి ఆ పడక గదులు. హైదరాబాదు నుండి సేద తీరడానికి శని,ఆదివారాల్లో విశాఖకు వస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు క్షేమ,సుఖ వ్యభిచారారానికి విశాఖనగరం యెంత అనుకూలమో.బయటకు అందమయిన మేడల్లా కనిపించే వసతి గృహాలు చాలావరకు వ్యభిచార గృహాలే ఇలాంటివి విశాఖనగరం నుండి భీమిలి వరకు వెలసాయి అంటే వ్యభిచార వ్యాపారం యెంత రంజుగా జరుగుతుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఈ అందమయిన వ్యభిచార గృహలన్నింటికీ అమ్మాయిలే హౌస్ కీపర్స్. కేసులు లేకుండా అమ్మాయిలను వాడుకోవడమే అతిధి గృహాల యజమానులు తెలివైన పని.

అనధికార లైంగిక క్రాష్ కు అనువైన చోటు విశాఖనగరం

సాగరతీరంలో శృంగారకన్యలు సరసమయిన ధరలకు దొరుకుతారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద టాక్ .పడుచుపిల్లకి పదివేలు,పెళ్లికాని పిల్లకు అయిదు వేలు 30 సంత్సరాలు వయసుంటే మూడు వేలు ఈ ధరలు గంట సేపు సుఖానికి మాత్రమే అన్ని ఖర్చులు శృంగారప్రియులే భరించాలి సుమా. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే అరగంటలోపే వచ్చేస్తుంది అదే పడుచుపిల్ల కావాలని ఆర్డర్ ఇస్తే అయిదు నిముషాలలో శృంగారతార కళ్లెదుటే ఉంటుంది అది మహావిశాఖనగరంలో సూపర్ స్పెషల్.సువిశాల విశాఖనగరంలో వ్యభిచారం విచ్చలవిడివిగా జరుగుతన్న చూసి చూడనట్టు తప్పించుకుంటారు పోలీసులు. మానాన్ని అమ్ముకుంటున్న అమ్మాయికి,కొన్నవాడికి లేని బాధ మాకెందుకు అంటున్నారు పోలీసులు, పట్టుకున్న కేసులు నిలబడవు.జడ్జి గారిముందు నా ఇష్టంతోనే ఆయనతో దేహాన్ని పంచి పడుకున్నాను అంటే చాలు కేసు నిలబడదు. కోర్టులో నిలబడని కేసులకు అరెస్టులుందుకు అనుకున్నారేమో వారుకూడా పట్టించుకోలేదు.ఇదే అదునుగా విశాఖమహానగరంలో విచ్చల విడి వ్యభిచారం పాతుకుపోయింది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే కాపురాలు నాశనమయి నేరాలు ఆడుతుతప్పి విజృంభిస్తాయి.ఇలాంటి అసాంఘిక చర్యలు ఆగాలంటే ప్రజాసంఘాలు. మహిళా సంఘాలు ముందుకు వచ్చి ఏవేర్నెస్ తేవాలి నేర రహిత నగరాన్ని పునఃనిర్మించాలి.

మధు.భోజంకి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles