కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా అత్యంత కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాసిన సిట్ పోలీసులు రాజ్ కసిరెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఆయన మూడుసార్లు సిట్ నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కాలేదు .ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం రేపు ఆయన విచారణకు వస్తాడో రాడో అన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు గుర్తించిన ఏపీ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అప్పట్లో నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయించడం ద్వారా భారీగా డబ్బులు వెనకేసుకున్నట్టు వైసిపి ప్రభుత్వ పెద్దలపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.