ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది.పార్టీ క్రమ శిక్షణను ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుతో అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో…వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ ఓ ప్రకటనంలో తెలిపింది.