ఉగ్రవాదులు..వారి మద్దతు దారులకు భారత ప్రధాని మోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ ఆత్మ పైన దుస్సాహసం చేసారని మండిపడ్డారు. దేశం దుఃఖంలో ఉందని చెప్పారు. ఈ దాడి పర్యాటకుల పై దాడి కాదు దేశంపై దాడిగా పేర్కొన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను.. దాని వెనుక ఉన్నవారికి ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి తెలియజేస్తున్నా ఉగ్రవాదులను వదిలి పెట్టమని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. కలలో కూడా ఊహించని శిక్ష
పహల్గాం ఘటన పైన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. బీహార్ లో పర్యటనలో భాగంగా పహల్గాం ఘటన పైన మోదీ స్పందించారు. భారత్ పైన దుస్సాహసానికి దిగిన వారిని వదిలేని లేదని మోదీ స్పష్టం చేసారు. న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. భారత్ కు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. మరణించిన వారిలో దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఉన్నారని వివరించారు. భారత్ సహనం పరీక్షించవద్దని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుది ముట్టించుతామని మోదీ ప్రకటించారు. ఎంతో మంది తమ వారిని కోల్పోయారని.. ఇది కేవలం పర్యటకుల పైన జరిగిన దాడి కాదన్నారు. భారత్ ఆత్మ పైనే దాడికి దిగారని మండిపడ్డారు. వీరికి సహకరించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని గర్జించారు. తుద ముట్టిస్తాం బీహార్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మధుబనిలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ఇక్కడకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదట పహల్గామ్‌లో మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఇప్పటికే పాకిస్థాన్ పైన దౌత్య సంబంధిత అంశాల పైన కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. ఇప్పుడు నేరుగా ఉగ్రవాదుల ఏరివేత పైన గురి పెట్టారు. ప్రధాని మోదీ ప్రపంచానికి సందేశం గా తన లక్ష్యాన్ని స్పష్టం చేసారు. ఊహకు మించిన ప్రతీకారం ఉంటుంద ని .. ప్రతీ ఒక్కరినీ ఏరివేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. తుద ముట్టిస్తాం
బీహార్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మధుబనిలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ఇక్కడకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదట పహల్గామ్‌లో మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఇప్పటికే పాకిస్థాన్ పైన దౌత్య సంబంధిత అంశాల పైన కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. ఇప్పుడు నేరుగా ఉగ్రవాదుల ఏరివేత పైన గురి పెట్టారు. ప్రధాని మోదీ ప్రపంచానికి సందేశం గా తన లక్ష్యాన్ని స్పష్టం చేసారు. ఊహకు మించిన ప్రతీకారం ఉంటుంద ని .. ప్రతీ ఒక్కరినీ ఏరివేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.