సింధూ జలాల నిలిపివేతపై భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీజలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. భారత్- పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ పాకిస్థాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీజలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని తెలిపారు. భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య మూడో పార్టీ జోక్యం అవసరం లేదని అన్నారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికి తెలిసిన విషయమే. భారత్ కేవలం పీఓకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధూ జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతుంది. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీజలాల ఒప్పందం రద్దు కొనసాగుతూనే ఉంటుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందే. భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్‌పార్టీ జోక్యం అవసరంలేదు. టెర్రరిస్టుల క్యాంప్ లను మూసి వేయాల్సిందే” అని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత్- పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. ఈనెల 10న డీజీఎంవోలు మధ్య కుదిరిన అవగాహనను అలాగే కొనసాగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంవోలు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను మే 07న ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన మే 10న ప్రకటించాయి. తాజాగా ఇదే నిర్ణయాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి.