Thursday, April 24, 2025
spot_imgspot_img

Top 5 This Week

spot_img

Related Posts

ఆంధ్రాలో మారుతున్న రాజకీయ “ముఖ” చిత్రం..


2024 లో జరిగిన సాదారణ ఎన్నికల్లో మూడు పార్టీలు కూటమి గా ఏర్పడి 164 స్థానాలతో అఖండ విజయం సాధించింది కూటమి. ఎన్నిక బరిలో ఉదృతంగా ప్రచారం చేసే సమయంలో ఎక్కడ చూసిన ప్రధాని నరేంద్రమోడీ,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జనసేన అధినేత కొణెదల పవన్కళ్యాణ్ ముఖాలతో ప్రచార రాధాలు,మేనిఫెస్టో పోస్టర్లు ,ఎక్కడ చూసిన పెద్ద పెద్ద ప్లెక్సీలు.సామాజిక మాధ్యమాలలో సూపర్ సిక్స్ ప్రకటనలతో కూడిన ప్రచారం ఆంధ్ర రాష్ట్రము హోరెత్తింది. కూటమి గెలిచిన నాటి నుండి రాష్ట్రమంతా నగరాలలో పెద్ద పెద్ద హోర్డింగులపై కూటమి నేతల ముఖాలు విజయోత్సవ ప్రకటనలతో నిండిపోయాయి.అంతే కాదు ప్రభుత్వ కార్యాలయాలలోను, పాఠశాలలోనూ,విశ్వవిద్యాలయ ఉపకులపతి కార్యాలయాలలోను చివరకు ప్రభుత్వం నిర్మాణం చేసిన మలమూత్ర విసర్జన కేంద్రాలలో కూడా కూటమి నాయకుల ముఖాలతో కూడిన ప్రకటనా గోడ పత్రికలూ వెలిశాయి.దిన పత్రికలలో పతాక పేజీలలో ముద్రణ జరిగింది. ప్రభుత్వ బహిరంగ సమావేశ ప్రసంగాలలో కూడా కూటమి నేతల పేర్లు ఒకరికొకరు వినిపించేవారు.
ప్రభుత్వం ఏర్పడిన నవమాసాలయింది కానీ కూటమి ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. మరి ముఖ్యంగా జనసేన,తెగులుదేశం కార్యకర్తలు ఒకే తాటిమీదకు రాలేకపోతున్నారు. తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు మాత్రం రాసుకొని పూసుకుని తిరుగుతున్నారు. కాదు కాదు తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు రానివ్వడం లేదు. ఈసమస్య జనసేన అధిష్టానానికి మొదటనుండి తెలిసిందే కానీ సర్దుకుపొమ్మని అధినేతనుండి లేఖ ముఖపుస్తకం ద్వారా అందుతుంది.ప్రభుత్వం గత మూడునెలలుగా ఎదో కార్యక్రమానికి శ్రీకారం చుడుతూనే ఉంది. రక రకాల గోడ పత్రికలూ ముద్రిస్తూనే ఉంది కొన్ని వాటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అయన కుమారుడు మంత్రి లోకేష్ ముఖచిత్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి.వారి ఇరువురి వార్తలు మాత్రమే వారి చేతి లో పత్రికలలో రాస్తున్నాయి. జనసేన నాయకుల,కార్యకర్తల గొంతు వినిపించడంలేదు, కొన్ని సందార్బాలలో జనసేన,బీజేపీలలో ఉన్న టీడీపీ అనుకూల నాయకుల గొంతు,ముఖచిత్రం కనబడతాయి అంటే ఆ రెండు పార్టీలలో కూడా టీడీపీ కోవర్టులు ఉన్నారని అర్ధం. ఇది నిజం.
తెలుగుదేశం పార్టీ ఏమిచేసినా పద్దతిగా చేస్తుంది ఏమి చేయాలనుకుంటుందో ఆ ఆలోచనను పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రజల మెదడులోకి పంపుతుంది.తీవ్రాతి తీవ్రమయిన చర్చకు మీడియా ద్వారా బలవంతముగా రుద్దుతుంది ఎవరికి ఇష్టమున్న లేకపోయినా అనుకున్నదే చేస్తుంది అదే మార్గమని నిర్దేశిస్తుంది.ఇలాంటి రాజకీయ ప్రక్రియల్లో తెలుగుదేశం ఆరితేరిందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అనకాపల్లి లో జరిగిన రోడ్డుకు శంకుస్థాపన,బహిరంగ సమావేశ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోగో తో పాటు చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ , పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మరియు ఇతర నాయకుల మూఖాలు ఉన్న పోస్టర్లు,ఫ్లెక్సీలు మాత్రమే వెలిశాయి. వాటిలో ఎక్కడ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖం ఉన్న ఒక్క బేనరు లేదు.ఇలాంటి రహస్య రాజకీయం చేయడంలో తెలుగుదేశం పార్టీ దిట్ట.ప్రజలు కార్యకర్తలు భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలు,మార్పులుకి ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు సంకేతం అని తెలుస్తుంది.
కూటమి ప్రభుత్వంలో జనసేన వాటాలో భాగంగా మంత్రి పదవి అనుభవిస్తున్న పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బియ్యం కార్డుల కొత్త పద్దతిలో మంజూరుచేస్తున్నాం అంటున్నారు ఎటిఎం కార్డులు లాంటి చిన్న కార్డులు ఇస్తున్నాము అంటున్నారు ఆ కార్డుపై ప్రజాప్రతినిధుల ముఖాలు ఉండవని చెప్పారు ఒకవేళ ఫోటో కార్డులపై ముద్రించాల్సి వస్తే ప్రధాని మోడీ ,పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటు లోకేష్ ముఖాలు కూడా ముద్రించాలి అందుకోసమేమో కార్డులపై ముఖాలు వద్దు అనుకున్నారు.ముఖ్యమంత్రి ముఖం మాత్రమే ముద్రిస్తే రాజకీయ రగడకు బీయిజం పడుతుందని అనుకున్నారేమో గాని తెలుగుదేశం జెండా పసుపు రంగుతో బియ్యమే కార్డులు పంపిణీకి సిద్దమయింది.ఆశ్చర్యం ఏమిటి అంటే జనసేన వాటా లో మంత్రి అనుభవిస్తున్న ఆపార్టీ రాజకీయ కార్యదర్శి నాదెండ్ల మనోహర్.ఎవరు,ఏపార్టీలో ఉన్నారు ఎందుకోసం పనిచేస్తున్నారు ఎవరికోసం పని చేస్తున్నారో తెలియజెప్పటానికి ఎదోక్క ఉదాహరణగా చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles