తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన పరి స్థితులు కొనసాగుతున్నాయి. వేడి తీవ్రత కొనసాగుతూనే.. వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. జూన్ తొలి వారంలో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతా వరణశాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం రేపు కర్ణాటక వద్ద తీరం దాటే అవకావం ఉంది. దీని కారణంగా రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.

అల్పపీడనం అరేబియా సముంద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రేపు కర్నాటకలో తీరం దాటే అవకాశం ఉంద ని వాతావరణ శాఖ వెల్లడించారు. దీని ద్వారా ఈనెల 23 వరకు అల్పపీడన ప్రభావం కొనసాగు తుందని పేర్కొన్నారు. ఈ కారణంగా దక్షిణాదితో పాటు అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురస్తాయని అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్ తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక. తెలుగు రాష్ట్రాలకు 7 రోజులు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. నైరుతీ రుతుపవనాలు దూసుకు వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
విస్తారంగా వర్షాలు అండమాన్ సముద్రం అంతటా నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న 2,3 రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలోకి రానున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండటం తో మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తులో మొదలై 5.8కి.మీ వరకు విస్తరించి ఉన్నా యి. అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలోనే ఉంది. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి ఆల్రెడి శక్తి అనే పేరును కూడా పెట్టారు. ఈ శక్తి తుపాన్ వచ్చే రెండు వారాలపాటూ ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి.
రుతుపవనాల రాక జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వచ్చే 3, 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, అండమాన్‌లోని మిగిలిన ప్రాంతాలలో, అలాగే మధ్య బంగాళాఖాతంకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురిశాయి. వచ్చే వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది.